యజ్ఞం   డా. చల్లపల్లి స్వరూప రాణి

యజ్ఞం డా. చల్లపల్లి స్వరూప రాణి

యజ్ఞం జరుగుతూనే ఉంది
అక్కడెవరో యూపస్థంభం మీద
ఒక ప్రాణిని నిలబెట్టారు
అది బిక్కు బిక్కు మ-ంటుంది
అచ్చం నాలాగే
ఊపిరాడటం లేదు
మనసంతా ఒకటే ఉక్కపోత
అన్నం తిందామంటే
పళ్ళెంలో తుపాకీ గుండు కలుక్కుమంటుంది
భగవత్గీత
చేత్తో లాఠీ పుచ్చుకొని
మళ్ళీ నన్ను ఊలెపటికి
తరుముకొస్తుంది
ఒక సంస్కృత శ్లోకం
కంట్లో నలుసై గొచ్చుతుంది
పుండునుంచి రసిక కారుతూనే వుంది
పడిలేస్తునిటారుగా నిలబడి
ఇపుడిపుడే
అద్దంలో నన్ను నేను చూసుకుంటుంటే
ఒక్క త్రిసూలం అమాంతంగా
బక్కలో బల్లెమై దిగబడింది
దారి పొడవునా
మనువులు, యజ్ఞవల్కులు
పరాశరులు, ఆదిశంకురులు
కాపుకాసీ
నా అడుగులను, నా మాటలను
తూనిక రాళ్ళతో కొలుస్తున్నారు
మెదడులో ఏదో నిఘూ యంత్రం
నా ఊసులకు పహారా కాస్తుంది
నా శరీరన్నెవరో  తూట్లు పొడిచి
పురుష శూక్తంలో దొర్లించినట్టుంది
బొత్తిగా గాలి ఆడడం లేదు
ఒక ఆదిమ నిర్భందం
గొంతుమీద వేలాడుతుంది
ఒక పురా గాయం సలపరిస్తూనే ఉంది
అవునూ
నేనిపుడు ఏ దీవిలో ఉన్నాను?
నా జంభూ ద్వీపం ఏమయ్యింది?
నా పవిత్ర గ్రంథం
రాజ్యాంగానికి ఆ కన్నాలేంటి?
నా ఆప్తమిత్రులు
మైత్రి , కరుణ , ప్రజ్ఞ
ఏ దేవాలయం కింద
భూస్తాపితం అయ్యారు?
గాలించాలి
మళ్ళీ ఈ దేశాన్నిచిత్రిక పట్టాలి
పాత ప్రశ్నలకు కొత్త జవాబులు వెతకాలి
యజ్ఞం జరుగుతూనే ఉంది

(Visited 138 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply