గ్రీస్‌ అధికారులపై సిరియన్‌ శరణార్ధులు తిరుగుబాటు

గ్రీస్‌ అధికారులపై సిరియన్‌ శరణార్ధులు తిరుగుబాటు

తమeight_col_turkeyను బలవంతంగా టర్కీకి తిరిగి పంపేందుకు ప్రయత్నించిన గ్రీస్‌ అధికారులపై సిరియన్‌ శరణార్ధులు తిరగబడ్డారు. వారు ఆందోళనకు దిగటంతో గ్రీస్‌ ప్రభుత్వం అయోమయంలోపడింది. ఇటీవల కుదిరిన ఇయు-టర్కీ ఒప్పందం కారణంగా గ్రీస్‌ టర్కీ సరిహద్దుల్లోని శరణార్థి కేంద్రాల్లో వుంటున్న వారిని అధికారులు బలవంతంగా టర్కీకి పంపేందుకు ప్రయత్నించటంతో వారు ప్రతిఘటించారు. శరణార్థుల సమస్యపై ఇయు- టర్కీ ఒప్పందం అమలు, దాని చట్టబద్ధతపై ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తాయి. సోమ, బుధవారాల్లో దాదాపు 750 మంది శరణార్థులను అధికారులు లెస్బోస్‌ దీవి నుండి టర్కీలోని డికిలి రేవు పట్టణానికి పంపారు. తమను టర్కీకి పంపటాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న శరణార్థులు ప్రతిఘటిస్తారని అధికారులు భావించినప్పటికీ ఇంత ఉద్రిక్తత వుంటుందనుకోలేదని ప్రభుత్వ వలస వ్యవహారాల విభాగం ప్రతినిధి జియోర్గోస్‌ కిరిట్సిస్‌ చెప్పారు. తిరగబడుతున్న శరణార్థులకు తాము నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వీరంతా యుద్ధభయంతో పారిపోయి వచ్చినవారే తప్ప యుద్ధ నేరస్తులు కారని ఆయన వివరించారు. ఐరోపా కూటమితో కుదుర్చుకున్న ఒప్పందం అమలులోకి రావటానికి 24 గంటలు ముందు వరకూ ఐరోపా కూటమి ప్రధాన కార్యాలయం ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించే పరిశీలకుడిని పంపలేదని తెలుస్తోంది. గ్రీస్‌ దీవుల్లో నిర్బంధంలో వున్న మహిళలు, చిన్నారులు, పురుషులను తరలించేందుకు ఎనిమిది ఫ్రాంటెక్స్‌ బోట్లను సిద్ధం చేసిన తమ అధికారులు ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం 2,300 మంది పరిశీలకులను కోరితే కేవలం 200మందిని మాత్రమే ఇయు అధికారులు గ్రీస్‌కు పంపారని కిరిట్సిస్‌ వివరించారు. ఇప్పటికీ తాము న్యాయ నిపుణులు, దుబాసీల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. పరిమితమైన బడ్జెట్‌ వనరులతో వున్నగ్రీస్‌ ప్రభుత్వం శరణార్థులకోసం చేస్తున్న పునరావాస ఏర్పాట్లతో ప్రస్తుతం దివాలా స్థితికి చేరిందన్నారు. అధికారులు బోట్లలో ఎక్కించేందుకు ప్రయత్నించినపుడు శరణార్థులు తమకు ‘స్వేచ్ఛ కావాలని, టర్కీ వద్ద’ ని నినాదాలుచేశారు. ఏథెన్స్‌ పోర్ట్‌ సిటీ పిరేయసలో కూడా ఇదే తరహాలో హింసాత్మక నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. గత వారాంతానికి గ్రీస్‌లో మొత్తం 52,147 మంది శరణార్ధులు నిలిచిపోగా అందులో ఏజియన్‌ దీవిలో నమోదయిన 6,129 మందిని పూర్తిగా తరలించారు. శరణార్థులకోసం బాల్కన్‌ మార్గాన్ని తిరిగి ప్రారంభించాలని గ్రీస్‌ ఇయు సభ్యదేశాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా అది బధిర శంఖారావంగా మారిపోయింది.

(Visited 65 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply