కవిత్వమంటే…. by ఇండస్ మార్టిన్, ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంగా

కవిత్వమంటే…. by ఇండస్ మార్టిన్, ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంగా

Dtd 16 December 2014

వీధిలో నిలబడి ధైర్యంగా అడుగుతుంది
వాచిన తలనుండి వంగిన నడుము మీదుగా
కాళ్ళకు అంటని పాదాలపై స్థిరంగా నిలబడుతూ
అచ్చంగా … ‘ప్రశ్నార్ధకం’ లా

ఏమిటి కవిత్వం …. ఏంటి వుద్దేశ్యం ?

మాటలు నేర్వని నా తలారి చెబుతాడు

కవిత్వమంటే
పొద్దంతా కాల్చిన అరిసెల్ని
పొద్దుమీదికి దిగాక డబ్బాలోకెత్తుకుని
దాకను తుడిచిన అమ్మ ఆఖర్న కాల్చే ‘వుక్కిరి ‘

కరేపాకూ కల్లుప్పూ జోడించి
ఎన్నపూసను ఎండు పిడకలమీద కరిగించి
నీర్కావి రంగు నెయ్యంతా వంపుకున్నాక
అమ్మ నా చేతిలో పెట్టే నల్లటి ‘గోదారి ‘

మాడుపు కారం- వుడుకుడుకు అన్నం
ముద్దముద్దగా మింగిన అమ్మ
అరిచేతిని పళ్ళెం అంచుకు గీరి
వేలితో నా నోటికి అందించే ‘గుంజు ‘

కంపుకొట్టే నా కడుపును బాగుచెయ్యడానికి
ముక్కుమూసి అమ్మ నాచేత తాగించే
అరకాసిన ఆమదం ‘వుగ్గు ‘

మాటల వరద ఎండిపోయాక
మనసు వాగులో వూరే చెలమ నీరే
కవిత్వమంటే!

(Visited 10 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply