చరిత్ర

ఏళ్ల చరిత్రలో వర్ణవాదానికి వ్యతిరేకంగా బహుజన శ్రామిక కులాల దృక్పథం తో ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆవిర్భావం. అందువల్ల ఈ సాహిత్య సాంస్కృతిక వారసత్వానికి తాను వారసురాలిగా ప్రకటించుకున్న ఐక్య వేదిక తన సాహిత్య సాంస్కృతిక ఉద్యమ మూలాలు ఎక్కడున్నవో వెతుక్కుంటున్నది. ఈ మన చరిత్ర అధ్యయనం చేయకపోతే మనం చరిత్ర లేనివాళ్ళు గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ చరిత్ర లో మనం ఎక్కడున్నాం ఏది మనది కాని చరిత్ర అని సరిచూసుకొని వర్గీకరించుకొని స్వంతం చేసుకోవడం, నిరాకరించడం చేయాల్సి ఉంది.
గ్రామ గ్రామామ నిన్నటి దాకా ప్రతికులానికి ఒక ఉపకులంగా కళాకారుల సంఘాలు, కళాకారుల కులాలు ఉండేవి.గొల్ల సుద్దులు, ఎల్లమ్మ కథలు, శారదకారులు,పాండవులోల్లు,చిందు మాదిగలు,పిచ్చకుంట్లు,దొమ్మరులు,కోయలు, గోండులు,సాధన శూరులు,పంబాలులు మొదలైన ప్రత్యేక కులాలు, తెగలు కళాకారులు ఉండే వారు. ఈ కళలన్నిటిని కలిసి ఇటీవల కొందరు జానపద సాహిత్యమని గిరిజన సాహిత్యమని వ్యవహారించారు. కానీ ఇదంతా ప్రజాహితం- బహుజన సాహిత్యం
వందల ఏళ్లు సాగిన భక్తి ఉద్యమాలు, వాటి సాహిత్యం కళలు శ్రామిక కులాల ద్వారానే బహుళప్రాచుర్యం పొందాయి. దాని నుంచి స్వీకరించి సొంతం చేసుకొని తాటాకుల్లో పద్యాలు గా మార్చుకున్న సాహిత్యాన్ని శిష్టి సాహిత్యం గా బ్రాహ్మణవాదులు ముద్ర వేస్కున్నారు. భక్తి ఉద్యమాల కన్నా కొంచెం ముందుకు వెళ్ళితే తాంత్రిక వాద, మాతృస్వామిక ఉద్యమాలు, ఇంకొంచెం ముందుకు వెళితే బౌద్ధ ఉద్యమాలు, అనీ తీసుకొచ్చిన మార్పులు నాగార్జునుడు, బుద్ధుడు మహావీరుడు, అసితకేశకంబళి, ఇంకా ముందుకు వెళితే చార్వాకులు ఇది మన చరిత్ర సంస్కృత వారసత్వం.
ఈ చరిత్ర మనం ముందుకు నడిపించాలనుకున్నాం. బౌద్ధ ప్రపంచంలో ఒక గొప్ప విప్లవం తెచ్చింది. ప్రజల కోసం,సమాజం కోసం సేవ చేసే తత్వాన్ని ప్రపంచానికి అందించింది, తొలుత బౌద్ధమే .వైద్యాన్ని, విద్యాదానాన్ని చేతబూని తత్వ శాస్త్రాన్ని ఆచరణ శాస్త్రంగా మార్చుకుని దేశ దేశాలు పర్యటించారు బౌద్ధులు. వర్ణ, కుల వ్యవస్థల్ని వ్యతిరేకిస్తూ, సముద్రంలో కలిసిన నీరు ఎలా సమానంగా ఉంటుందో అన్ని కులాల ప్రజలు సమానమేనని చెప్తూ తమ సేవ ప్రేమ ద్వారా ప్రజల చైతన్యాన్ని అభివృద్ధి పరిచారు . బౌద్ధ గతితర్కం , ప్రాపంచిక దృక్పథం ఆ కాలానికి ప్రపంచానికే వెలుగు . ఇక్కన్నించి కళలు శాస్త్రాలు గ్రీకు వెళ్లిన తర్వాత అక్కడి కళలు కలలు శాస్త్రాలు చాలా మార్పులు పొందాయి , అక్కడి రాజకీయ శాస్త్రాలు రూపుదిద్దుకోవడం మొదలైంది.

అలెగ్జాండర్ దండయాత్ర కు ఒక కథ చెప్తారు .అక్కడ గొప్ప సంపద ఉన్నది గొప్ప విజ్ఞానం ఉన్నది అనీ. బుడ్డగోచితో ఆనందంగా ఉంటూ రాజులను సైతం లెక్కచేయని ధీరత్వం ఉంది అని అలెగ్జాండర్ ఇక్కడి నుంచి వెళ్ళిన జ్ఞానం అక్కడ రాజ్యాధికార వాద రూపంలో ఈ ఖండాన్ని జయించాలనే కోరిక జనింపజేసింది.అంత గొప్ప సంపద కళలు, విజ్ఞానం ఇక్కడ ఈనాటికే వర్ధిల్లాయి. వాటిలో బ్రాహ్మణ వాదం ఉంది. బహుజనవాదం ఉంది. బ్రాహ్మణ వాదులు చరిత్ర ను ఎలా వక్రీకరిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.మార్క్సిస్టులు అదే పని చేస్తున్నారు. వాళ్ళు పాశ్చాత్య తత్వ శాస్త్ర చరిత్ర లో ప్రారంభిస్తారు. దానికి పునాది అయిన చార్వాక బౌద్ధ దార్శనికతను వదిలేస్తారు.
బౌద్ధ సామాజిక విప్లవం వెయ్యేళ్ళ విరాజిల్లింది. ప్రజల భాషల్ని అభివృద్ధి పరిచింది. ప్రజల విభిన్న ప్రాంతాల భాషలు కల్సీ పాళీ భాషగా రూపొందింది. పాళీ సాహిత్యం కలలు, ప్రపంచ మంతటా విస్తరించాయి .ఇపుడవి చరిత్ర తవ్వుకునే గనులయ్యాయి.పాళీ నుండి ప్రాకృతం. ప్రాకృతం నుండి సంస్కృతం రూపొందిందని చరిత్రకారులు,భాషాశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే చరిత్ర మూల నిధి అయిన పాళీ సాహిత్యాన్ని వదిలేసి నాస్తిక హేతువాదులు, మార్క్సిస్టు లు, భౌతిక వాదులు సంస్కృతి సాహిత్యాన్ని తమ ఆధారాల కోసం పట్టుకువేలాడుతున్నారు. తద్వారా సంస్కృత బ్రాహ్మణీయ సాహిత్యాన్ని తమకు తెలియకుండానే వాస్తవ చరిత్ర గా ముద్ర వేస్తున్నారు.
బౌద్ధం క్షీణదశలో భక్తి ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఈ రెండూ సాహిత్యం ,కళల్ని,సంపదని,ఉత్పత్తిని ఎంతో సంపన్నం చేశాయి. ఎంత సంపన్నం చేశాయంటే 1810 దాకా పారిశ్రామిక విప్లవం ప్రపంచంలో వచ్చినప్పటికీ ప్రపంచం వ్యాప్తంగా ఇక్కడి వస్తువులు ఎగుమతి అవుతూ ఉండేవి. అసలు యూరప్ దేశాల వాళ్ళు ఇక్కడి సరుకుల్ని అక్కడికి తీసుకెళ్ళి వ్యాపారం చేసేవారు. 1810 తర్వాత ఈ స్థితి మారింది. ఈ చేతి వృత్తుల మీద,కుటీర పరిశ్రమల మీద ఆధారపడిన,కులాలు కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి.ఆ కులాల అకళల ప్రభావం పారిశ్రామిక విప్లవ సరుకుల వరదలో కొట్టుకుపోయింది. అయితే ఇలా వచ్చినమైన చరిత్ర అంతా కలిసి మనకు రెండు వందల ఏళ్లు కూడా కాలేదు. కానీ వేల ఏళ్లుగా అణచివేయబడ్డామని .మనకు ఏ కళలు రావని బ్రాహ్మణవాదులు,బ్రాహ్మణీయ భౌతికవాదులు, బ్రాహ్మణీయ మార్క్సిస్టులు జాతీయోద్యమం పేరిట మనకు చరిత్రను అందిస్తున్నారు వక్రీకరిస్తున్నారు.
మనం సగర్వంగా చెప్పాల్సిందేమిటంటే ప్రతీ వస్తువును సరుకుని ఉత్పత్తి చేసింది మనం.పాటలు పాడింది మనం,డప్పు,పిల్లన గ్రోవి,వీణ నుంచి మొదలుకొని మనం ఎన్ని సంగీత వాయిద్యాలు తయారు చేసామో, ఒక్కొక్క కులం వద్ద ఒక్కో వాయిద్యం ఉంది . ఒకరి వద్ద డప్పు,ఒకరి వద్ద వాయిద్యం,ఒకరి దగ్గర డోలు,ఒకరి వద్ద మృదంగం , ఒకరి వద్ద తుడుం. ఒక్కో కులం ఒక్కో వాయిద్యం మొదలయింది. అంతే కాకుండా ఆయా కులాలకున్న ఉత్పత్తి పరికరాలలో కూడా ఒక గొప్ప సంగీతం ఉన్నది. మనం వాడే గొడ్డలి లో ఒక సంగీతం ఉన్నది. మనం బట్టలు ఉతకడం లో ఒక సంగీతం ఉన్నది . మనం ధాన్యం దంచడం లో , విసుర్రాయి విసరడం లో ఒక సంగీతం ఉన్నది మనం దున్నడంలో, మన వేటలో, మన మోటలో,మన నాట్లలో మన సంగీతం ఉన్నది . వాటిని మనం పంట పాటలని ,పండుగ పాటలని పిలుచుకుంటాం.
ఇలా ఉత్పత్తి సంబంధంలో ఉంటూ నాణ్యమైన నాణ్యమైన సరకుల్ని ఉత్పత్తి చేస్తూ నైపుణ్యమైన అభివృద్ధి పరిచారు మనవారు ఇలా అభివృద్ధి పరిచిన కలళ్నుంచి ఆయా ఉపకులాలు ఏర్పడి వాళ్ళు వాటిని వెంట తీసుకొని మన చరిత్ర ని పురాణ ఇతహాసలుగా చెప్పే రూపం తీసుకున్నాయి. ఆ తర్వాత రాజులు ఈ ప్రక్రియల్లో తమ వీరగాథల్ని చెప్పించే ప్రయత్నాలు చేసారు. అవును రాస్తాన్న చరిత్ర పద్ధతి పశ్చిమ దేశాల నుండి దిగుమతి చేసికొన్నది. ఒక కాశ్మీర్ చరిత్ర బౌద్ధ సాహిత్యం, తప్ప మిగతా చరిత్ర ఇలా లిఖించబడదు.గతం వర్తమానానికి స్ఫూర్తి నిచ్చె ఒక సాహిత్యంగా మన చరిత్ర శ్రవ్య సాహిత్యం గా కొనసాగుతూ వచ్చింది.దీన్నుంచి కొంత తీసుకుని లిపి బద్దం చేసారు. బౌద్ధ సాహిత్యం కూడా శ్రామిక కులాల ఉత్పత్తి విధానం. వారి సంస్కృతుల్ని చిత్రించడం ప్రధానం చేయలేదు. తన ఉద్యమ పరిధిలో కి వచ్చిన వారినే రికార్డు చేసింది. ముస్లింలు వచ్చాక తారికులు దస్తావేజులు పరిపాలనా సంబరమైన చరిత్రను చరిత్ర గా ఇప్పటి కీ భావించడం లేదు. ఆర్ధిక సాంఘిక సాంస్కృతిక జీవితమే వారు చరిత్రగా భావిస్తున్నారు.
చేతి వృత్తులుగా పిలువబడేవన్నీ గొప్ప కళలే. ఒక కుండను చేయడం గొప్పకళ. ఒక కర్రును చేయడం ఒక గొప్ప సైన్సు, చెప్పులు చేయడం, బట్టలు నేయడం,లోహవస్తువులు చేయడం ఒక గొప్ప కళ. అదే సమయం లో అదొక గొప్ప శాస్త్ర విజ్ఞానం .ఇలా కళలు శాస్త్ర విజ్ఞానం ఆయా కులాల వృత్తిల్లో రెండూ కల్సి కొనసాగేవి నేత, విశ్వ బ్రాహ్మణ కులాల ఉత్పత్తులు రెండున్నరవేల ఏళ్లు పారిశ్రామిక విప్లవం వచ్చేదాకా సమాజం సంస్కృతి, నాగరికతలను ,ఆనాటికి అందుకొన్న సైన్సు స్థాయిని స్పష్టం చేస్తాయి. వ్యవసాయం లో, నాటి పరికరాల్లో వచ్చే మార్పులకు విశ్వబ్రాహ్మణ కుల వృత్తులు సైంటిస్టులు గా, ఇంజనీర్లు గా ఎంతో ఉపయోగపడ్డాయి విశ్రాంతి వర్గాలు కులాలు అంటే వర్ణాధిక్య కులాలు ఏం చేశాయంటే కళలన్నిటి అప్లై యాడ్స్ అనీ కుదించారు. చతుష్టష్టి(అరవై నాలుగు) కళలు గా పేర్కొన్న సంప్రదాయం బహుజన ధృక్పథానికి సంబంధించినదే. వీటిని ఆ తర్వాత లలిత కళలు గా ఆరు కళలకు సంఖ్య ను కుదించడం లో బ్రాహ్మణ వాదం ఉంది. వారు తమ విశ్రాంతి వర్గాలకు అనుగుణంగా ఉన్న కళల్నే లలితకళలు గా వర్గీకరించి మిగితా కులాల కళల్ని వర్గీకరణ కు వెలుపలే ఉంచేసి శ్రామిక కులాల వృత్తుల కింద , వారి కర్తవ్యం గా వ్యాఖ్యానించారు. సంస్థ కులాల వృత్తిలో అప్లయిడ్ సైన్స్ లో ఉన్నటువంటి కళాత్మకతను కళలుగా పరిగణనలోకి తీసుకోకుండా కళల్ని లలిత కలలు గా ఆరింటిక కుదించడంలో పాలక వర్గాల, బ్రాహ్మణ వాదుల కుట్ర ఉన్నది . శ్రామిక కుల వృత్తులన్నీ కళలే అదే సమయం లో అదే సమయంలో శాస్త్రాలే అనే విషయాన్ని మనం అర్థం చేస్కోవాల్సి ఉన్నది . ఈ రోజు డిజైన్సు ఇంజనీర్స్ అనే వాళ్ళు నాడు మన పూర్వీకుల వృత్తి పనినే పారిశ్రామిక. యుగంలో కొనసాగిస్తున్నారు.
ఈనాటి ఇంజనీర్లు గొప్ప కళాకారులు, మనం వేసుకునే బట్టల్లో మనం వాడే ఫ్యానులో,రేడియో లో,కూర్చీలో, మోటారు బండ్ల లో స్కూటర్ల లొ ప్రతీ రంగంలో డిజైనింగ్ కళ అభివృద్ధి చెందింది. దాన్ని ఇంజనీర్లు రూపొందిస్తున్నారు. ఈ పనిని కళల్ని మన దేశంలో 1810 దాకా ప్రపంచం గర్వించే స్థాయిలో రూపుదిద్దిన కళాకారులు, ఇంజనీర్లు ఈ దేశ శ్రామిక కులాలే. గిరిజనులే ప్రకృతి సంపదకు తోడుగా ఇంత గొప్ప కళల్ని సంపదని సైన్సును అభివృద్ధి పరిచిన మనం అజ్ఞానులమని ఎవరో అనేస్తే నమ్మేయడమేనా! వేళ ఏళ్లుగా సైన్స్‌ టెక్నాలజీ కళలు మన చేతులు మీదుగానే అభివృద్ధి చెందాయి . అయితే మనకు తాటాకుల చదువు పెద్దగా అవసరం లేనందువల్ల ఈ చరిత్రను మనవారు రికార్డు చేయక చరిత్ర కంటిన్యూటీ (క్రమపరిణామ చరిత్ర ) కోల్పోయాం మనం . ఈ. చరిత్రనంతా మనం మన చరిత్రగా వెలికి తీయాల్సి ఉంది . లోహయుగ పూర్వ చరిత్ర అందరూ కల్సి నిర్మించిన. చరిత్రయితే లోహయుగం నుండి నిర్మించిన చరిత్రంతా బహుజనులు నిర్మించిన చరిత్రే.
పని నుండి అనుభవం పుడుతుంది . పని నుంచే ఆలోచన పుడుతుంది . పని నుండి ఒక ఫలితం పుడుతుంది . ఈ ఫలితం కాకుండా అదనంగా ఆలోచనా పుడుతుంది . పని తీరుని రూప కళ అన్నాం. పని నుండి పుట్టిన అనుభవం సైన్స్‌ గా ఎదిగింది. ప్రకృతిలయలొ పనిలోని ఉచ్ఛాసనిశ్వాసాల్లో, పనికదలికల్లో సంగీతం నాటకం ఆవిర్భవించాయి. ప్రకృతి రూపం పనిరూపం, పనిఫలితం రూపం కళగా రూపుదిద్దుకున్నాయి. ఇలా పని నుండి ఫలితం, అనుభవం, ఆలోచన, సైన్సు, కళ,ఏకకాలంలో పుడ్తున్నాయి. ఇలా పనినుండి పని ఫలితం, అనుభవం, ఆలోచన, సైన్సు, కళ, ఏకకాలంలో పుడ్తున్నాయి. ఈ విషయమై నిన్న (12-5-1995) ఉదయం మామనూరు పాటల వర్కు షాపులో వివరంగా చెప్పే ఉన్నాను. పనిచేయని వానికి ఆలోచనలు ఎక్కువ అని ఓ సామెత ఉంది. అయితే అవన్నీ పనికిరాని చెత్త ఆలోచనలే. ఈ అర్థంలో పనిచేయని వానికి ఆలోచనలు ఎక్కువ అనే సామెత రూపుదిద్దుకున్నది. బ్రాహ్మణవాదులు పనికొచ్చేపనేమీ చేయకుండా పనికిరాని చెత్త ఆలోచనలు ఎన్నో చేశారు.
పనితో సంబంధం లేని తాత్విక చర్చలు విశ్రాంతి వర్గాల పరాక్కబక్కలు వాగుడే. ప్రపంచ తత్వశాస్త్రాల్లో పాలక వర్గ చరిత్ర లో ఈ వాగుడు విస్తారంగా కనబడుతుంది.నిజమైన శాస్త్రీయ, ఆలోచన, కళలు సైన్స్ మన దేశం లో లోహయుగం నుండి పనిలో ఆనందం పొందే శ్రామిక కులాలే రూపొందించాయి.జనపాదాలు, గణతెగలు కళలకు, శాస్త్రాలకు, పుట్టినిల్లు. వీటిని కొనసాగిస్తూ అభివృద్ధి పరుస్తు తరం నుండి తరానికి అందించిన మహోన్నత శాస్త్రవేత్తలు,కళాకారులు, ఇంజనీర్లు శ్రామిక కులాల వారే . మన నుండి తమకు తీరిక కి అనువుగా మలుచుకోగలిగి కళల్నే బ్రాహ్మణవాదులు, పాలకవర్గాలు లలిత కళలంటూ కుదించారు.సమస్త కళల్ని శాస్త్రాల్ని ఉత్పత్తిలో పాల్గొంటూ సామాజిక సంబంధాల్లో పాల్గొంటు మనం యుద్ధాలో పాల్గొంటూ ఆచరించాం. ఈ చరిత్రంతా మనది. అయితే పాలక వర్గాలు బ్రాహ్మణవాదులు మన చరిత్ర వారి చరిత్ర గా రాసుకన్నారు.ఇప్పుడు రాయబడుతున్న చరిత్ర ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర ప్రధానంగా బ్రాహ్మణవాదుల. చరిత్ర అనీ మన చెప్పకపోతే మనం చరిత్ర సరగ్గా అధ్యయనం చేయలేం. అర్థం చేసుకోలేం. ఒకటి గుర్తుంచుకోవాలి . లిఖిత సాహిత్యాన్ని పట్టుకొని అది సమాజ సాహిత్యం గా, చరిత్ర గా కళలుగా మన మీద దిద్దుతున్నారు . కానీ మన కళలంటూ మనకున్నాయి . అవి ఆయా కులాల్లో ఉన్నాయి. ఆయా కుల వృత్తుల్లో ఉన్నాయి . వారి సాహిత్యాల్లో ఉన్నాయి.
మన భాషలో మన సాహిత్యంలో మన నుడికారం లో మన భాష పరిణామం లో, మన పాటల్లో మన పదాల్లో మను చరిత్ర పరిణామం ఉంది. ఆయా కుల వృత్తుల పరికరాల్లో టెక్నికల్ సంబంధాలున్నాయి. పారిశ్రామిక ఇంగ్లీషు టెక్నాలజీ ని సైన్స్ శ్రామిక కులాల పదాలతో సంబంధం లేని బ్రాహ్మణవాదులు అనువాదించడం తో ఆయా పదాలన్నీ కృత్రిమంగా సంస్కృత భయిష్టమైపోయాయి. వాటన్నిటినీ శ్రామిక కుల వృత్తుల్లోని పరికరాల పదబంధాల్లోకి తిరగ రాయాల్సి ఉంది.
మన భాషను, చరిత్రను గతకొంత కాలంగా జానపద సాహిత్యం అవి, గిరిజన సాహిత్యం అని విడి విడి శాఖలు పెట్టారు. ఇది సాహిత్య వర్గీకరణ రూపంలో కొనసాగుతున్న వర్ణవాద వర్గీకరణే. అశేష ప్రజల సాహిత్యం ఒక శాఖగా మారడం. అశేష ప్రజల్ని శూద్రులుగా అతి శూద్రులుగా వర్గీకరించడం రెండూ ఒకటే. అగ్రకులాలే సమస్త సమాజం అనే వర్ణవాద దృక్పథమే వారి సాహిత్యమే మొత్తం సమాజ సాహిత్యం అని ముద్ర వేసి కొనే కుట్రుంది. దీన్ని స్పష్టం చేసి మన సాహిత్యమే సమాజ ప్రతినిధి సాహిత్యంగా పాఠ్యపుస్తకాలు చరిత్ర రూపొందించాల్సి ఉంది.
భక్తి ఉద్యమాలు దేవుళ్ళను కీర్తించి బ్రాహ్మణవాదాలకే సహకరించాయి. అనే ఒక గంపగుత్త ప్రచారాన్ని నాస్తిక హేతువాదులు కొందరు చేస్తున్నారు. గతితార్కిక భౌతిక వాదులు భక్తి ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. బౌద్ధ ఉద్యమా ల ద్వారా అభివృద్ధి చెందిన ప్రాంతి భాషల అభివృద్ధి భౌధ్దం కుంటుపడడంతో భక్తి ఉద్యమాల ద్వారా ముందుకు సాగింది. పాళి భాషలో నేటి ప్రాంతీయ భాషల వెయ్యేళ్ళనాటి పదాలను, అర్థాలను, అని మారుతూ వచ్చిన తీరును అధ్యయనం చేస్తే ఓ విషయం మరింత స్పష్టం అవుతుంది
సంస్కృత భాష వ్యాప్తి లేదు. అందువల్ల ప్రాంతీయ భాషల ద్వారా సంస్కృతం(నేటి ఇంగ్లీషు లాగ) అభివృద్ధి చెందిందేగానీ అది ప్రాంతీయ భాషలను అభివృద్ధి పరిచిందనడం సత్యదూరమ. కానైతే బ్రాహ్మణ వాదులు తమ భావజాల ఆధిపత్యంలో భాగంగా సంస్కృతాన్ని ప్రాంతీయ భాషల పై రుద్దిస్థానిక నుడికారాన్ని అణిచివేసింది. గట్క (సంకటి) అనే తెలుగు పదం పంజాబ్ ఉత్తర ప్రదేశ్ బీహార్‌లో నూ గట్టిగానే ఇప్పటికి వ్యవహారంలో ఉందంటే, బతుకమ్మ పండుగ కొద్ది మార్పులతో బీహార్ లో నూ ఇప్పటి కి జరుపుతారంటే(దాని ఛట్టి అని పిలుస్తారు) మన బహుజనుల భాష సంస్కృతి కూడా నిరంతరం ప్రవాహ సదృశంగా దేశ వ్యాప్తంగా పరస్పర సంబంధంలో కొనసాగుతున్నాయని స్పష్టం అవుతున్నది. ‘కింటాకుంటే’ పదాలతో ఎలెక్సుహెలీ ఆఫ్రికా నీగ్రో “ఏడు తరాల” చరిత్ర రాసినట్లుగా “గట్క” వంటి పదాల జాడల ద్వారా బహుజన సమాజ చరిత్రను వాస్తవాల పునాది గా నిర్మించాల్సి ఉంది.
భౌధ్ద ,భక్తి ఉద్యమాల ద్వారా ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడానికి కారణం కూడా శ్రామికులే నిరంతర ప్రయాణాల అంతటా దొరకని ఉప్పు తదితర సరుకుల నిత్యరవాణా, అమ్మకం కొనుగోలు శ్రామిక కులాల జీవనం లో భాగమయ్యాయి భౌద్ధం లో భక్తి ఉద్యమాల్లో చేరిన

శరీరాన్ని తొలగమంటావా? ఎవరు గెలుస్తారో ఓ పట్టు పడదాం. అప్పుడే ఎవరు తొలగాలో తేలిపోతుందన్నాడు. అది ఆదిశంకరుని మిథ్య వాదం చండాలుడి ముందు మట్టి కట్టుకుపోయింది. అక్కణ్ణుంచి పారిపోయాడు . అలాగే మన నిర్వాహకులు ఈ పిండాకూడ తల్లిదండ్రులకి చేరేదైతే పొరుగూరికి సద్ది తీసుకెళడం దేనికి. ఇంటి ముందు పెడ్తే పొరుగూరులో ఉన్న వాడి కడుపులోకి చేరిపొదా! అనీ నిలదీశారు
 ఈనాడు మంత్ర తంత్రాలు అని పేరు పెట్టి మన దళితులను గ్రామాలలో చిత్రహింసలు పెడుతున్నారు. తంత్రవాదం మాతృస్వామికం నుండి కొనసాగుతున్న ఒక శాఖ బౌద్ధం లో తంత్రవాదం ఒక శాఖ స్త్రీ నీ తల్లి ని గౌరవించే వ్యవస్థనుండి ఉద్భవించింది . అది ఎన్నివికృతలలో పోనివ్వండి. సృష్టి కి స్త్రీ మూలం అనే భావన అందులో యిమిడి ఉంది. బ్రాహ్మణవాద బెదిరింపులకు ప్రతిగా ఒరేయ్ మీకు వేద మంత్రాలు ఉంటే నిన్ను చంపే మంత్రాలు మా వద్ద ఉన్నాయి అని సవాలు చేశారు. మంత్రం చేసి నేను కప్పకాలు విరిచేస్తే నీ కాలు విరిగిపోతుంది అని బెదిరించారు
 ఇక పారిశ్రామిక విప్లవం విజయవంతమైన కాలానికి వస్తే నేడు చర్చిస్తున్న చరిత్ర క్రమం ప్రారంభమవుతుంది. పదోశతాబ్దంలో శైవవుద్యమం,పదకొండవ శతాబ్దంలో వైష్ణవి ఉద్యమం ప్రారంభమయ్యాక యిక్కడ ఎన్నో మార్పులు జరిగాయి. యూరప్ లో జరిగిన రివైజాన్స్ మనదేశంలో శక్తి ఉద్యమాల రూపం తీసుకున్నాయి. ఎంత ఉత్పత్తి పెరిగితే ఇన్ని యుద్ధాలు, ఇన్ని కోటలు, గుళ్లు నిర్మాణం రాజులుగానబజానాలు సాధ్యపడతాయో అంచనా వేయండి. ధ్యానం, ఆరోగ్యసూత్రాలు ద్వారా బహుజనుల చేతిల్లో ఈ సమస్త కళలు,ఉత్పత్తులు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇవి శ్రామిక కులాల చేతుల్లో సాధనాలు గనక బ్రాహ్మణవాదులు వీటి గొప్పతనాన్ని గుర్తించి నిరాకరించారు. ఈ బ్రాహ్మణవాద దృక్పథమే గతితార్కిక చారిత్రక భౌతికవాదంగా కూడా కొనసాగుతున్నది. ఇప్పుడు దీన్ని తవ్వి తీసి అది తప్పని నిరూపించాల్సిన భాద్యత మన మీద ఉన్నది.
పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక- అసలు ముందుగా పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటో చూద్దాం, వర్ణవ్యవస్త పదాల్లో చెప్పాలంటే అది శూద్ర విప్లవం. శూద్రులు చేతుల ద్వారా చేసే పనులు యంత్రాల సాయంతో చేయడం. అంటే ఈ దేశంలో పారిశ్రామిక వేత్తలుగా కార్మికులుగా ఇంజనీర్లుగా, సైంటిస్టు లు గా ఎవరు మారాల్సి ఉండేదంటే వాళ్ళు స్పష్టంగా బహుజనులు, శూద్రులు, గిరిజనులు- శ్రామిక కులాలు. కాని జరిగిందేమిటి? అగ్రవర్ణాలవాళ్లు దీన్ని కైవసం చేసుకొన్నారు. ఈరోజు ఒక ఇంజనీరు ని తీసుకోండి- ఒక పారిశ్రామిక వేత్తను తీసుకోండి – అగ్రకులాలవారే కనపడతారు
అంతకన్నా ముందు వ్యవస్థలోవారు ఉత్పత్తులు చేశారా?కాకపోతే వారు కొంత కాలం పెట్టుబడులు పెట్టారు . చేతి వృత్తుల సరకులు అమ్ముకొని బ్రతకడం కోసం కొందరు వ్యాపారులు పెట్టుబడులు పెట్టారు .కానీ ఉత్పత్తి మీద ప్రత్యక్ష జోక్యం ఉత్పత్తిలో పాల్గొనడం ఉండేది కాదు . కానీ ఈ రోజు పారిశ్రామిక యజమానులు గా ఎదిగి ఉత్పత్తిని సొంతం చేసుకున్నారు. దాంతో పాటు అగ్రకులాలనుండే కార్మికుల నాయకత్వం దిగుమతి కావడం మొదలయింది. ఈ తలకిందుల స్థితి ఇంతకు ముందు లేదు .ఇలా చరిత్ర వక్రమార్గం పట్టడం అనేది యూరప్ నుండ పారశ్రామిక విప్లవం దిగుమతికావడం మొదలైంది.

అయితే ‘నారగోని’ చెప్పినట్లు అందులో ఒక లాభం కూడ జరిగింది. వలస పాలకులు మన సార్వత్రిక విద్య ను కొనసాగిస్తూనే వచ్చింది. బహుజన శక్తి ఉద్యమాలలో కూడా సార్వత్రిక విద్య ను ప్రవేశపెట్టారు .అయితే ఈ అవకాశం రెండు వేల ఏళ్ళ తర్వాత దొరికింది అనడం సరికాదు. ముస్లింలు కూడా సార్వత్రిక విద్యను మనకందించారు. అంతకు ముందు బౌద్ధం కూడా క్రీ.శ. ఆరవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం దాకా సార్వత్రిక విద్య ను కొనసాస్తూనే వచ్చింది. బహుజన శక్తి ఉద్యమాలలో కూడా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టారు. అయితే అవి లిపి బద్దం కాకపోవడం వల్ల మనకందలేదు. లిపి బద్ధమైన బౌద్ద సాహిత్యం నాశనం చేయబడింది. లిపి బద్ధమైన ఆధునిక విద్యను అందించింది. యూరపు వాళ్ళు అయితే దీన్ని అగ్రకులాలే ముందు అందిపుచ్చుకున్నాయి.
ఈ రోజు మనం బహుజనులం అమెరికాలో, ఇంగ్లండు కు ఎంత మందిమి పోగలుగుతున్నాం? ఆ రోజుల్లో అమెరికా, ఇంగ్లండు లకు వెళ్ళగలిగినవారు కమ్యూనిజం గురించి చెప్పేవారంటే వారు ఎంతో ధనవంతులై ఉంటారు. అలాంటి ధనిక అగ్రకులాలు మార్క్సిజం గురించి తత్వశాస్త్రం గురించి చెప్పడం మొదలెట్టారు. వీరెవరికి ఇక్కడి ఉత్పత్తి గానీ, ఉత్పత్తి కులాలో పుట్టిన కళలు శాస్త్రాల్లోగాఈ, ప్రవేశంగానీ ఆసక్తి లేనివాళ్ళు , ఉత్పత్తి కులాల పై కార్మికుల పై తిరిగి తమ ఆధిపత్యం కొనసాగించడాన్ని కనువుగా బ్రాహ్మణవాదాన్ని మార్క్సిజం రూపంలో వీళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. కార్మిక వర్గ నాయకత్వం యిప్పటికి ఎన్నడూ ఉత్పత్తిలో పాల్గొనని వారి చేతుల్లో ఉందని మనం గమనించాలి. ఇలా అగ్రకులాల వాళ్ళు కార్మిక నాయకులు గా రావడానికి సహకరించిందేమిటి? అగ్రకులాల నుండి పారిశ్రామిక వేత్తలు, కార్మిక నాయకులు గా ఆ కులాలే రావడం వారే మార్క్సిజం మి ప్రమోట్ చేసి కోవడం జరిగింది. ఈ అగ్రకుల పారిశ్రామిక వేత్తలు, బ్యూరాకాట్లు నశిస్తే మార్క్సిజం, కార్మిక నాయకత్వం తాలూకు అగ్రకులాలు నశిస్తాయి. మార్క్సిజం లోని నిజమైన మార్క్సిజం ఏదైనా ఉంటే అది బహుజనులు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఉదా- గతితార్కిక భౌతిక వాదం యొక్క కొన్ని అంశాలు తీసుకోవచ్చు.
ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం నుండి వర్ణవాదులు లాభాల్ని కైవసం చేసికొన్నారొ అప్పుడే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బహుజనుల గొంతు మూగపోయింది. ఒక యాభయి ఏళ్ల దాకా మూగబోయింది. ఆ తర్వాత మహాత్మాజ్యోతిబాపూలే అందుకొని రణ నినాదం ఇచ్చాడు. ప్రపంచ ఉత్పత్తి రంగంలో మనం 1810 నుండి వెనకబడి పోయాం 1848 నాటికి జ్యోతిబాపూలే మనదైన సిద్ధాంతం తో రంగం మీదికి వచ్చాడు. అంతా కల్సి ఇలా మనం వెనబడింది. ఓ యాభై అరవై ఏళ్లు, పూలే వర్గకుల లింగ దృక్పథం తో ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని సాంస్కృతిక విప్లవం ప్రతిపాదించాడు. ఈ పదజాలం ఆయన ఉపయోగించకపోయిన ఈ పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తించాడాయన. స్త్రీ ల కోసం దేశంలో ని మొదటి సారిగా పాఠశాల లు పెట్టాడు. అలా యాభై అరవై ఏళ్లు లేటుగానైనా సరే మూగవోయిన బహుజన కంఠం విచ్చుకోవడం మళ్ళీ ప్రారంభం అయింది. అట్లా వచ్చిన మన క్రమంలో పారిశ్రామిక విప్లవ అభివృద్ధిని అంది పుచ్చుకున్న వాళ్ళు మన కంఠాన్ని అణచివేసే ప్రయత్నాలు చేసారు. వారికి చదువు ప్రయాణాలు అందుబాటులో ఉన్నాయి. తీరిక అదనపు విలువతాలుకూ సంపద అందుబాటులో ఉన్నది . దానివల్ల వారు మరింత ధనవంతులై మరింత అగ్రకులాలవారిగా మారి ఎంత అభివృద్ధి చెందారంటే వారు పూర్తిగా అణచివేసి స్థాయి కి ఎదిగారు.
అంతకన్నా ముందు రాజుకి భూస్వామికి అగ్రకులాలకు శ్రామిక కులాల కు మధ్యన సుఖాల్లో, తిండి లో, జ్ఞానం లో పెద్ద తేడా ఉండేది కాదు . తెలంగాణాలో ఇటీవలి దాకా ఒక సామెత ప్రాచుర్యం లో ఉంది . ” అయ్యా దొర మీ మీసాల అన్నం పిల్లి తినిపోయింది” అనేది సామెత . అసలు విషయమేమంటే ఆ దొర రోజూ మక్కగట్కా (మొక్కజొన్న సంకటి) నే తింటాడు. అతడు భూస్వామి. అయితే వరి అన్నం తిన్నట్టు కనపడ్డం కోసం మీసాల్లో కొన్ని మెతుకులు ఇరికించుకొని పదిమందిలోకి వస్తాడు. అందుకోసం ఓ చెంచాడు బియ్యం వంట చెయ్యిస్తాడు. ఆ అన్నాన్ని ఆ రోజు పిల్లి తినిపోయింది . దాన్ని పాలేరు దొరకు నివేదించాడు.
భూస్వామి అగ్రకుల దొర ఇటీవలి దాకా మనలాగే విప్లవం మక్క గట్క తినేవాడంటే మనకూ వారికి జీవన ప్రమాణాల్లో ఏ పాటి తేడా ఏడ్చినట్టు? పారిశ్రామిక విప్లవం విజయవంతమయ్యాకే ఈ సామాజిక అంతరాలు, జీవన ప్రమాణాలు మధ్య విపరీతమైన తేడాలు ఏర్పడ్డాయి. శ్రామిక కులాలు చేతి వృత్తులు దెబ్బతిని మరింత నిరసించి పోవడం జరిగింది. మనం ఇలా ఉన్నచోటనే ఉంటూ చేసే వృత్తులే చేస్తున్నప్పటికీ పారిశ్రామిక విప్లవం వల్ల బాగా దెబ్బతినిపోయాం. ఉన్నచోటనే ఉంటూ నిరసించి పోవడానికి ఒక ఉదాహరణ ఇస్తాను.
జగిత్యాల్లో అంగడి బజార్లో మా యిల్లున్నదొ మా ఇంటి చుట్టురా అందరివీ కుమ్మరి గూన పెంకుటిల్లే. కొన్ని గుడిసెలుండేవి. మా ఇల్లు పెంకుటిల్లు ఈ నలభయ్ ఏళ్లలో మా ఇంటి చుట్టూరా కొన్ని బంళాలయ్యాయి. ఓ రోజు ఓ పంతులమ్మ తనను ప్రశ్నిస్తున్న పిల్లలకు వీళ్ళు చాలా పేదవాళ్ళు అని మా ఇల్లు గురించి మా గురించి చెప్తోంది. దాన్ని విన్న మా మూడో అబ్బాయి కిరణ్(అప్పటికి ఏడోతరగతి) అమ్మా మనం పేదవాళ్ళమా అంటూ అమ్మను అడిగాడు. నిజానికి మేం పేదవాళ్లం కాలేదు. మా చుట్టూ ఉన్న ఇతరులు ధనవంతులయ్యారు . బంగ్లాలు కట్టుకున్నారు. మా ఇల్లు అలాగే ఉన్నది. నలభై ఏళ్ల క్రితం అందరి ఇల్లులాగే ఉండేవి. మమ్మల్ని పెద్దలు అనీ చెప్పిన పంతులమ్మ కూడా పేదది.నెలకు ఆరువందల జీతం పై పనిచేస్తోందా అమ్మాయి. రెండు వేలు జీతం తీసుకునే మమ్మల్ని పేదవాళ్ళు అని చెప్తున్నది ఆ మాట మామీద రుదబడుతున్నది. అలా మనం ఉన్నచోటనే ఉన్నా పేదవాళ్ళం అవుతాం. గిరిజనులు ఉన్నచోట ఉంటూనే ఎప్పటిలాగే పోడు వ్యవసాయం చేసుకుంటారు . శ్రామిక కులాలు ఎప్పటిలాగే తమ వృత్తుల్ని తాము చేస్కుంటారు. వ్యవసాయ పద్ధతులు పారిశ్రామిక ఉత్పత్తి విధానం ముందుకు సాగాయి.మనం ఉన్న చోటనే ఉన్నాం. ముందుకు సాగినవారు మనల్ని వెనకబడినవారు అని అంటున్నారు . అలా గిరిజనులు , శ్రామిక కులాలు , పారిశ్రామిక విప్లవం తో వెనకబడిపోయి అంతరాలు బాగా పెరిగాయి. పారిశ్రామిక విప్లవ ఫలితాలు అందిపుచ్చుకున్న అగ్రకులాలు మనను తీవ్రంగా అణచివేసాయి. వారి అణచివేత మరింత సుస్థిరంగా కొనసాగడం కోసం జాతీయోద్యమ రూపంలో ముందుకు వచ్చారు . వారి ఆధిక్యత, అణచివేతలకు ప్రజల భాష, ఆశల రూపం ఇవ్వబడింది
 దానికి స్పష్టమైన రూపం ఇచ్చినవాడు తిలక్. ఆ తర్వాత గాంధీ . ఇలా బ్రాహ్మణవాదం జాతీయోద్యమం రూపంలో కొనసాగుతూ వచ్చింది
ఇలాంటి అగ్రకుల జాతీయ వాదాన్ని వ్యతిరేకించారనే పేరుతో అంబేడ్కర్‌ ను కమ్యూనిస్టు లు ఈసడిస్తారు. ఇటీవల ‘ప్రజాసాహితి’ పత్రిక లొ జాతీయవా్దాన్ని అంబేడ్కర్‌ వ్యతిరేకించాడని అతడు కర్ణుడు లాంటి వివాదాస్పదుడని ‘డఫోడం’ అనే సంస్థ వారి మిత్రుల తరుపున ఏర్పడ్డ తర్వాత కూడా సంపాదకీయం రాసారు. జాతీయ వాదంలో మమేకం అయ్యే వారెవరంటే స్పష్టంగా అగ్రకులాలవారే, అగ్రకులాల భూస్వామ్య పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే. ఈ దేశంలో జాతీయోద్యమంగా ఊరేగింది. అందుకే వారు అణగారిన కులాలను, గిరిజనులను ప్రత్యేకవర్గాలుగా గుర్తించి రాజ్యాధికారంతో , సంప్రదింపుల్లో సమాన వాటా యిచ్చే విషయమై నిర్ణయించేందుకు వచ్చిన సైమన్ కమిషన్ ను కొంచెపు బుద్ధి తొ కాంగ్రెస్ వాదులు బహిష్కరించారు. ఇదీ అగ్రకుల జాతీయోద్యమ నిజస్వరూపం. ఈ చరిత్ర ఇలా ఉందని కమ్యూనిస్టులు నక్సలైట్లు రాయకపోవడానికి కారణం అవి అగ్రకుల నాయకత్వం లొ అగ్రకుల ప్రయోజనాలకే కుదించుకుపోవడం.
ఈ జాతీయవాదం ఎవరికి. ఈ స్వాతంత్ర్యం ఎవరికి అని పూలే అంబేడ్కర్‌ లు ప్రశ్నించారు. ఇప్పుడున్న అగ్రకులాలు, జమీందార్లు, పాలకవర్గాల కా? శ్రామిక కులాలు అశేష ప్రజలైన మాకా? నిజమైన స్వతంత్ర్యాన్ని కోరిందెవరు- పూలే అంబేడ్కర్ లు
ఈ మార్క్సిస్టు లు రెండు నాలికలధోరణిలో ఏమంటారంటే జాతీయోద్యమం సందర్భంగా అంబేడ్కర్‌ సందర్భంగ ఇలా చెప్పి 1947 ,ఆగష్టు 15 న మనకు స్వాతంత్ర్యం రాలేదు అధికార మార్పిడి జరిగిందంటారు. అధికార మార్పిడి ఎవరికి జరిగింది. అగ్రకులాలకు జమీందార్లకు భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు ఇదే జరగబోతుంది అనే కదా అంబేడ్కర్ దశాబ్దాల తరబడి స్పష్టం చేసింది. జాతీయోద్యమ స్వభావం గురించి అంబేడ్కర్‌ మనకన్నా కొన్ని దశాబ్దాల ముందే హెచ్చరించాడని ఈ నక్సలైట్లు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోయారంటే అక్కడ అగ్రకుల పాలక వర్గ ప్రయోజనాలు కాపాడుకోవాలి
జాతీయోద్యమ కాలంలో ఆరేడు సామాజిక సిద్ధాంతాలు బలంగా ముందుకు వచ్చాయి. 1. అగ్రకుల హిందూ భూస్వామ్యపారిశ్రామిక జాతీయ వాదం. 2. శ్రామిక కుల రైతు కూలీ,కార్మిక దళిత వాదం. 3. జాతుల సమస్యలవాదం. 4. నాస్తిక హేతువాదం 5. ముస్లిం జాతీయ వాదం 6. కమ్యూనిస్టు సోషలిస్టు వాదం 7. గిరిజన రైతాంగ తిరుగుబాట్లు. కాంగ్రెస్, ఆర్ ఎస్సెస్, బిజెపి, రామ్మోహన్‌ రాయ్ ఆర్యసమాజం బ్రాహ్మణ సమాజం మొదటి దాన్లోని పాయలు . జ్యోతిభాపూలే, అంబేడ్కర్‌ నారాయణగురు, భాగ్యారెడ్డి వర్మ( భాగయ్య) సత్యశోధక ఉద్యమం రిజర్వేషన్ల ఉద్యమం రెండో దాన్లో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు రాష్ట్రాలకు యితోధిక అధికారాలు, అధికార వికేంద్రీకరణ మాతృభాష ప్రాధాన్యత కేంద్ర రాష్ట్ర సంబంధాలు మూడో దాంట్లో భాగం. పెరియార్ రామస్వామి, జస్టిస్ పార్టీ త్రిపురనేని రామస్వామి ద్రావిడ కజగం, డి. యం. కె ద్రావిడ దేశం వాదన నాలుగో దాన్లో భాగం. ముస్లిం ల అధికారం ఇస్లాం ముస్లిం ల కు ప్రత్యేక దేశం మహ్మద్‌ అలీ జిన్నా, ముస్లిం లీగ్ నేటి మైనారిటీ ల సమస్య అయిదో దాన్లో భాగం.

కమ్యూనిస్టులు , నక్సలైట్లు, సోషలిస్టులు ఆరోదాన్లో భాగం. గిరిజన రైతాంగ పోరాటాలు , గిరిజన రాష్ట్రాల ఏర్పాటు, నక్సలైట్ల సాయుధ పోరాటాలు, బిర్సాముండా, కొమరం భీం ఏడోదాన్లో భాగం
ఆరేడు సామాజిక సిద్ధాంతాలు, వాటి ఆచరణ ఈ నూటయాభై ఏళ్ళలో దాదాపు ఏకకాలంలొ రూపుదిద్దుకున్నాయి, ముస్లిం జాతీయవాదం పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా పరిష్కారించబడింది. మనదేశంలో మాత్రం మైనారిటీ సమస్య గా యింకా కొనసాగతోంది. దళితవాదం రిజర్వేషన్లు సమాన హక్కులు సాధించుకునే పూర్తి స్థాయికి ఎదగడానికి ముందుకు వస్తోంది. ఆర్ ఎస్ ఎస్, బిజెపి పరివారం స్పష్టంగా అగ్రకుల హిందూ భూస్వామ్య పారిశ్రామిక ఫాసిజంగా ఎదుగుతూ కాంగ్రెస్ సన్నగిల్లుతోంది. నాస్తిక హేతువాదాలు, ద్రావిడవాదం తమిళనాడు లో అధికారం లోకి కూడ వచ్చాయి. జాతుల సమస్య రాష్ట్రాల పునర్విభజన రూపంలో కొంత పరిష్కారించబడి మరి కొంత యిప్పటికి రగులుతూనే ఉంది . జార్ఖండ్, గోర్ఖాలాండ్, ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేక తెలంగాణా, ఉత్తరఖండ్, ఖలిస్తాన్, గొండ్వానా మొదలైన ఎన్నో రూపాల్లో కొనసాగుతూనే ఉంది. గిరిజన సమస్య పరిష్కారించకపోగా అది జాతుల సమస్యరూపంలో నక్సలైట్ల సాయుధపోరాటాల రూపంలో కి మలుపు తీసుకుంటున్నది. జాతీయోద్యమం నుండి నేటిదాకా కొనసాగుతున్న పరిణామాలివి
మనదేశంలోకి విదేశీయులు కాబూల్ మీదగా భూమార్గాన ప్రవేశించిన శ్రమలవల్ల ఉత్తర ప్రాంతాలు సైనికయుద్ద. రాజకీయ కేంద్రాలుగా నిలదొక్కుకునే క్రమంలో దక్షిణాది పై పెత్తనం చెలాయించడం మొదలైంది. యూరపు వారి ప్రవేశం యిలా సాగలేదు. వారి ప్రవేశం సముద్రాల గుండా పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణ సముద్ర తీరప్రాంతాల ద్వారా జరిగింది. కలకత్తా, బొంబాయి, సూరత్‌ , ఢాకా, మద్రాసు , గోవా వంటి ప్రాంతాలు వారి కేంద్రలయ్యాయి. ఆర్యుల, ముస్లిం ల విస్తరణక్రమాణికి భిన్నంగా ఎదురీతలా యూరప్ వారి విస్తరణ సాగింది. ఈ చరిత్ర మనకు తెలుసు. కాసేపు ఇక్కడ ఆగుదాం.
యూరప్ వారి వ్యాపారినికి వలసలకు ప్రమాణ మార్గాలు సముద్రానికి అభిముఖంగా ఉండాలి .నౌకాశ్రయాలకు బెస్తలు ఎంతో అవసరం. నౌకలనిర్మాణానికి, రోడ్డు కు, రైలు పట్టాలకు, శ్రామికకులాలు, వారి పశువులు అవసరం. ఇలా యూరప్ వారి సంబంధంలోకి వచ్చినవి శూద్రకులాలే. యూరపువారితో సంపర్కం లో వీరు కొత్త జ్ఞానం లోకి ప్రవేశించారు. వారికి సహకారించిన శ్రామికకులాలనుండి వ్యాపారవేత్తలు దుబాసీలు కొంత ఎదిగారు. తద్వారా స్థానిక శ్రామిక కులాలనుండి వలసవాదుల ప్రపాకంతో ఒక కొత్త వర్గం రూపొందడం ఎదగడం ప్రారంభమైంది. దాంతో మడీ గిడీ అంటూ కూర్చున్న బ్రాహ్మణవాదులు రంగం మీదకు వచ్చారు . అవకాశాలు లాక్కున్నారు శ్రామిక కులాలు వెనకబడిపోయాయి. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఏమింటే మొదట ఎదిగిన శ్రామిక కులాలు ఏమైపోయాయి. వాటి చరిత్ర ఎందుకు అడుగడుగున పడిపోయింది ? వారి నుండి ఎదగాల్సిన శ్రామిక కులాలు నూతన బూర్జువా దృక్పథం ఏమైపోయింది? అది ఎదిగినా అణచివేయబడిందా! అసలు ఎదగలేదా? ఇంత దాకా యూరప్ వలసలతో, నౌకాశ్రాయలతో ఎదిగిన అగ్రకుల బూర్జువా వర్గం గురించే చెప్తున్నారుగానీ శ్రామిక
 కులాల నుండి ఎదగాల్సిన బూర్జువా వర్గం గురించి చెప్పడం లేదు . ఈ క్రమాన్ని వెలికితీయకుండా ఆధునిక చరిత్రలో మనమూలాలు ఎక్కడున్నాయో మనం ఎలా అణచివేయబడ్డామో తెల్సుకోవడం సాధ్యం కాదు.
ఇంతకు ముందు చెప్పిన ఆరేడు సామాజిక సిద్ధాంతాల్లో నాలుగైదు సిద్ధాంతాలు ఈ నౌకస్తావరాలు, వాటి వ్యాపార మార్గాల ప్రాంతాల నుండే వచ్చాయి . మన అఖండ భారతదేశ పటాన్ని ఒకసారి పరికిించి చూస్తే మీకీ విషయం స్పష్టమవుతుంది . పంజాబ్ బెంగాల్ నుండి ముస్లిం జాతీయవాదం, బెంగాల్ పంజాబీ జాతీయవాదాలు కమ్యూనిజాన్ని ఆదరించడం పుట్టాయి. బొంబాయి రాష్ట్రం నుండి పూలే, అంబేడ్కర్‌ ల శ్రామిక కులాలవాదం, ఆర్ ఎస్ ఎస్ హిందూఅగ్రకుల జాతీయవాదం , తిలక్ గాంధీలు వచ్చారు. మద్రాసు నుండి పెరియార్ రామస్వామి, నాస్తిక హేతువాదం, ద్రవిడవాదం, కేరళ నుండి నారాయణ గురు మొదలైన వారు ముందుకు వచ్చారు.
బొంబాయి, మద్రాసు ప్రాంతాలనుండి పులే , అంబేడ్కర్‌ , నారాయణగురు , పెరియార్ రామస్వామి వంటి శ్రామిక కులాల జాతులవాదం ఎదిగినట్టుగా, పంజాబ్, బెంగాల్, ఢాకా ప్రాంతాలనుండి స్థానిక శ్రామిక కులాల జాతీయవాదం , గానీ శ్రామిక కులాల జాతీయ బూర్జువా వర్గవాదంగానీ ఎందుకు ఎదగలేదు! ఎదిగితే అది ఏమైంది? ఈ ప్రశ్నలకు జవాబు చరిత్రనుండి తవ్వి తీయడం ద్వారానే శ్రామిక కులాల తాత్విక సిద్దాంతాల అణచివేత, ఎలా కొనసాగిందో అందుకు బ్రాహ్మణ వాద మార్క్సిజం ఒక సాధనంగా ఎలా ఉపయోగపడిందో మూలల్తో సహాస్పష్టం చేయడం సాధ్యపడుతుంది. ఏమంటే చరిత్ర దొరికిన మేరకు శ్రామికులాల సత్యశోధక ఉద్యమాన్ని నాశనం చేయడం నుండే కమ్యూనిస్టు ల ట్రేడ్ యూనియన్ పుట్టుక సాధ్యపడిందని ‘ నారగోని’ తన పుస్తకం లో స్పష్టం చేసే ఉన్నాడు. ఇది బొంబాయి ప్రాంతంలో జరిగిన అణచివేత చరిత్ర. పంజాబ్ బెంగాల్ ఢాకాల్లో అణచివేసిన యిలాంటి చరిత్ర ను వెలికి తీయడం మన చారిత్రక కర్తవ్యం. ఆ ప్రాంతాల్లో ఇదే అభివృద్ధి జరిగినా శ్రామిక కులాల ఉద్యమాల చరిత్ర ఎందుకు కనుమరుగై పోయింది. జ్యోతిబసు, సి.పి.యం, నక్సలైట్ల ఆధిపత్యానికి గల మూలాలు అక్కడ బయల్పడుతాయి. మనను అణచివేయడం నుండే వాళ్లు ఎదిగారని జ్యోతి బసు అక్కడ బ.సి లెవరూ లేరు బి.సి రిజర్వేషన్లు అవసరం అనీ అనడమే స్పష్టం చేస్తున్నది.
జాతీయోద్యమంనుండి కొనసాగుతున్న ఈ పై అయిదారు దృక్పథాలు ఇంకా పరిష్కరించబడలేదు. ముస్లిం జాతీయవాదం పాకిస్తాన్ గా పరిష్కరించబడి మైనార్టీ సమస్య గా నిత్యం ముందుకు వస్తూనే ఉన్నది . స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈ దృక్పథాల్లో ఏదో ఒకటి ఆధిపత్యం లోకి రాగలిగే స్థితిలో లేవు . తెల్లవాళ్లు వెళ్లిపోతున్నారు. కనక మనం తర్వాత పోట్లాడుకుందాం- ముందు మనలో మనం ఒక అవగాహన కి వద్దాం అనీ ఒక ఐక్యవే్దిక స్థాయిలో ఇప్పుడు మన ఐక్యవేదికలాగా- రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది రాజ్యాంగంలొ వీరందరి భావాలు మనకు కనబడతాయి . ఈ అయిదువాదాల కలగలుపు యింకా పరిష్కారం కాని తీరును రాజ్యాంగంలో స్పష్టంగా చూడవచ్చు . ఈ రోజు బి.జె.పి ఈ రాజ్యాంగాన్ని తిరగరాస్తానంటునది. హిందూ అగ్రకుల ఫాసిస్టు రాజ్యాంగా దీన్ని మార్చాలని వారి ఆలోచన
అంటే 1947 నాటి కలగలవు ఐక్యవేదిక ఒప్పందం కాలం తీరిపోయిందని నేను బలం పుంజుకున్నానని బి.జె.పి కాలు దువ్వుతోంది
దళితుల రిజర్వేషన్లు , మైనారిటీ ల హక్కులు, సైంటిఫిక్ దృక్పథాన్ని ప్రోత్సాహించాలనడం, మత స్వేచ్ఛ, సోషలిస్టు సమాజం – కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగంలొ ఒక కలగలుపుగా చేర్చుకున్న విషయం యిట్టే గుర్తించవచ్చు. ఈ పొందికనే బి.జె.పి ప్రశ్నిస్తున్నది. కమ్యూనిస్టు లు నక్సలైట్లు అటొ యిటో తేల్చుకోవాల్సి ఉన్నది.
పశ్చిమ దక్షిణ భారతం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అగ్రకులపాలకవర్గ సిద్దాంతాల్తో పాటు శ్రామిక కులాల తాత్విక సిద్ధాంతాలు ఉద్యమాలు సగర్వంగా నిలబడ్డాయి. అనే ఈనాడు అఖిలభారత ఐక్యతకు ఉప్పు అందించాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీ ల ఐక్యత ఈ చారిత్రక నేపధ్యంలో రూపుదిద్దుకుంది. ఇదీ మనవారసత్వం