లింగాయత్‌ లను ప్రత్యేక మతం గా గుర్తింపు

లింగాయత్‌ లను ప్రత్యేక మతం గా గుర్తింపు

లింగాయత్‌ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మత మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్‌ దాస్‌ కమిటీ సిఫారసులను ఆమోదించాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాకట కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది.

లింగాయత్‌లకు మాత్రమే ప్రత్యేక మతమైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వీరశైవ లింగాయత్‌ స్వాములు హెచ్చరించిన నేపథ్యంలో ఈ అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్‌లో భాగంగా వీరశైవ లింగాయత్‌లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మత మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉంది.

(Visited 31 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply