‘దళితులపై వివక్ష చూపితే తాట తీస్తా’ – ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ

‘దళితులపై వివక్ష చూపితే తాట తీస్తా’ – ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ
నెల్లూరు (వేదాయపాళెం) : దళిత, గిరిజనులపై వివక్ష చూపితే తాటతీస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ హెచ్చరించారు. నెల్లూరులోని కస్తూరి దేవి పాఠశాలలో ఉన్న రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కల్యాణ మండపంలో మంగళవారం దళిత, గిరిజన అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే దళిత, గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వారు విఫలమవుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడమేనన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దుర్వినియోగం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమానికి రూ.16వేల కోట్లు కేటాయించారని చెప్పారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతుంటే కోర్టుకు వెళ్లి వాటిని అడ్డుకోవడాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలన్నారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. కమిషన్‌ సభ్యుడు బద్దేపూడి రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళిత, గిరిజనులను నిర్లక్ష్యం చేశాయన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కారెం శివాజీ దళిత, గిరిజనుల నుంచి కుల సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, ఐటీడీఏ పీవో కమలకుమారి, డీటీడబ్ల్యూవో గిరిధర్‌, కాపు నేత తేలపల్లి రాఘవయ్య, అట్రాసిటీ కమిటీ సభ్యుడు పాముల హరిప్రసాద్‌, ఈదూరు విజయ్‌కుమార్‌, పేనేటి సునీల్‌కుమార్‌, పందిటి సుబ్బయ్య, కేసీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పందిటి సుబ్బయ్య ఆధ ్వర్యంలో నాయకులు కారెం శివాజీ, బద్దేపూడి రవీంద్రను ఘనంగా సన్మానించారు. మాదిగల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పల్లా శ్రీనివాసులు, సునీత తదితరులు పాల్గొన్నారు.

(Visited 53 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply