కారంచేడు లో మాదిగపై హత్యాకాండ:1985 జులై 17

కారంచేడు లో మాదిగపై హత్యాకాండ:1985 జులై 17

దళితుల తలలపై భూస్వాముల గొడ్డళ్లు నాట్యం చేశాయి. నిరుపేదల ఒంటిపై వేట కొడవళ్లు వీర విహారం చేశాయి. ఇదేమి అన్యాయం అని అడిగినందుకు కత్తులు కాలుదువ్వాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం కారంచేడులో దళితుల నెత్తురు కాల్వలై పారింది. అగ్రవర్ణపు దురహంకారం అమాయకుల్ని పొట్టనపెట్టుకుంది. దళితులపై అగ్రవర్ణ భూస్వాముల దాడితో… దళితులంతా ఏకమై అనేక పోరాటాలు చేసి కొంతమేర విజయం సాధించారు.

1985 జులై 17 చరిత్రలో చీకటి అధ్యాయం….
1985 జులై 17… చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దళితులపై అగ్రకుల శక్తులు దాడి చేసిన రోజు. కత్తులు, బరిసెలతో వెంటాడి, వేటాడి… భూస్వాములు రాక్షసానందం పొందిన రోజు. కారంచేడు మారణహోమంతో… యావత్భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన నేటికీ మానని గాయంగానే మిగిలిపోయింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపిందిCongressOnTDP.
1985 జులై 16న మంచినీటి చెరువు వద్ద వివాదం…..
1985 జులై 16న… కారంచేడులోని మాదిగపల్లె మంచినీటి చెరువు వద్దకు… కావడితో కత్తి చంద్రయ్య నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్ళాడు. అగ్రకులానికి చెందిన శ్రీనివాసరావు చెరువులో కుడితి పోశాడు. ఇదేంటని ప్రశ్నించిన కత్తి చంద్రయ్యపై శ్రీనివాసరావు దాడికి పా0001ల్పడ్డాడు. అప్పుడే మంచినీరు తెచ్చుకునేందుకు వచ్చిన సువార్త అనే మహిళ చంద్రయ్యపై దాడిని అడ్డుకొని శ్రీనివాసరావును బిందెతో కొట్టింది. దీంతో ఈ విషయం కాస్తా చినికిచికిని గాలివానలా మారింది. మరుసటి రోజు గ్రామంలోని భూస్వాములంతా కూడబలుక్కొని ఉదయం ఆరుగంటల ప్రాంతంలో కత్తులు, బరిసెలు లాంటి… మారణాయుధాలతో పథకం ప్రకారం మాదిగపల్లెపై దాడిచేశారు. సుమారు వెయ్యి మంది గ్రూపులుగా విడిపోయి దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ పాశవికదాడిలో తేళ్ళ మోషే, తేళ్ళ యేహోషువ, తేళ్ళ ముత్తయ్య, దుడ్డు వందనం, దుడ్డు రమేష్ హత్యకుగురయ్యారు. సుమారు 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
ఉద్యమాన్ని ఉధృతం చేసిన అభ్యుదయవాదులు…….
కారంచేడు దుర్ఘటనను నిరసిస్తూ… వామపక్ష, హేతువాద, రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమాన్ని ప్రారంభించాయి. అమాయకుల ప్రాణాల్ని పొట్టనపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం దోషులను అరెస్ట్ చేయకపోగా… ఉద్యమం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి జైల్లోపెట్టి అణిచివేసే ప్రయత్నం చేసింది. కానీ ఉద్యమం చల్లారిపోలేదు.
55 మందికి శిక్ష విధిస్తూ గుంటూరు సెషన్స్ కోర్టు తీర్పు……
విద్యార్ధులు, దళితులతో పాటు అణగారిన వర్గాలకు సంబంధించిన సంఘాలు బాధితులకు పునరావాసం కల్పించి న్యాయ పోరాటం చేశారు. దీంతో గుంటూరు సెషన్స్ కోర్డులో 55 మంది… నిందితులకు వివిధ రకాల శిక్షలు విధిస్తూ తీర్పు వెలువడింది. క్రింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ… నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్డు నిందితుల శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నడూ లేని విధంగా ఐదు రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం… కారంచేడు సంఘటన జరిగిన 24 ఏళ్ల తర్వాత గుంటూరు సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ 55 మందికి జైలు శిక్షను విధించింది ధర్మాసనం.
కారంచేడు ఘటన జరిగిన తరువాత ఎన్నో దాడులు…
కారంచేడు ఘటన జరిగిన తరువాత రాష్ట్రంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. కానీ కారంచేడు ఉద్యమ పోరాట స్ఫూర్తితో దళితులపై దాడికి కారకులైన వారిని శిక్షించాలంటూ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కొన్ని సంఘటనలలో నిందితులు శిక్షించబడ్డారు, మరికొన్ని సంఘటనల్లో తప్పించుకున్నారు. నరమేధం సృష్టించిన కుల క్రౌర్యంతో… కారంచేడు మాదిగలంతా యుద్ధం చేసి ఆధునిక దళిత శకం ప్రారంభించారు. రుధిర క్షేత్ర ఘటన భారతదేశంలో దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి ఒక ప్రతీకగా నిలిచింది.

 

 

 

 

 

 

 

 

 

(Visited 766 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply