బుద్ధుడికి ఆర్‌ఎస్‌ఎస్‌కు బద్ద విరోధం – ప్రొఫెసర్ కంచె ఐలయ్య

బుద్ధుడికి ఆర్‌ఎస్‌ఎస్‌కు బద్ద విరోధం – ప్రొఫెసర్ కంచె ఐలయ్య

రాజధానికి అమరావతి అని పేరుపెట్టారు. తీరా చూస్తే భారీ ఎత్తున పూజలు, హోమాలు చేస్తున్నారు. బుద్ధుడికి పూజలు ఉండవు. ఒక వేళ పూజలే చేయాలనుకుంటే రాజధానికి బుద్ధుడి పేరుకాకుండా రాముడి పేరుపెట్టాలి. అమరావతికి గౌతమబుద్ధుడి పునాదులున్నాయి. కానీ ఇక్కడ బుద్ధుడి విగ్రహమే కనపడడంలేదు. నిజం చెప్పాలంటే బుద్ధుడి పేరు పెట్టినందువల్లే బీజేపీ రాష్ట్రానికి పైసలు ఇవ్వడంలేదు. నిధులు ఇవ్వాల్సిన మోదీ రాజధానికి ఏమిచ్చారు? పవిత్ర నదీజలాలు, పుణ్యభూమి అని పెద్ద మట్టి కుప్ప తప్ప! నరేంద్రమోదీ ఎక్కడ పునాది వేసినా మంచి జరగదు’ అంటూ ఏపీ, కేంద్ర ప్రభుత్వాధినేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య.

బ్రాహ్మణులు తిని కూర్చుంటారని, బహు భార్యలతో ఉన్న శ్రీకృష్ణుడు ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడని, రాముడు ఆదివాసీల నాయకురాలు తాటకిని చంపాడని, లక్ష్మణుడు అందగత్తె శూర్పణఖ ముక్కు చెవులు కోశాడని… ఇలాంటి వారు ఆరాద్య దైవాలుగా ఎలా ఉంటారని, వేదాల వల్ల ప్రజలకు ఒరిగింది ఏదీ లేదని జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ ఫ్రొఫెసర్‌ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీఎం నేతలు పర్సా సత్యనారాయణ, నండూరి ప్రసాదరావుల సంస్మరణార్ధం శనివారం విజయవాడలో ‘దేశభక్తి, భిన్న దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘నవ్యాంధ్ర రాజఽధానికి ‘అమరావతి’ పేరు పెట్టారు, ఇది బుద్ధుడికి సంబంధించినది. బుద్ధుడికి ఆర్‌ఎస్‌ఎస్‌కు బద్ద విరోధం. అందుకే నరేంద్రమోదీ మట్టి, నీరు ఇచ్చి సరిపెట్టారు. బుద్ధునికి సంబంధించినది గనుకే నిధులు ఇవ్వడం లేద’’ని వ్యాఖ్యానించారు. బుద్ధుడు మతపరమైన వ్యక్తి కాదని, ఆయన జీవనశైలి వేరని పేర్కొన్నారు. రాజదానికి శంకుస్థాపన చేసిన చోట బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ‘‘అమరావతి పేరు పెట్టారు. హిందూ విధానంలో పూజలు చేశార’’ని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అటు జె రూసలేంకు, ఇటు తిరుపతికి కూడా వెళ్లారని, ఆ తర్వాత పావురాల గుట్టలో కనిపించకుండా పోయార’’ని అన్నారు. వేదాలు గజిబిజిగా ఉంటాయని, ఏ బ్రాహ్మణుడు మంత్రాలు చెప్పినా అవి అర్ధం కావన్నారు. ప్రకృతి విలువలను, మానవ విలువలను పెంపొందించినవాడు బుద్ధుడేనని చెప్పారు. మహాత్మా పూలేతోనే ఆధునిక చరిత్ర ప్రారంభమయిందని, అంబేద్కర్‌, సావిత్రిబాయి పూలే, పుచ్చలపల్లి సుందరయ్యలు ఆదర్శ ప్రాయులు అన్నారు.

(Visited 1,261 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply