చుండూరు మాలలపై హత్యాకాండ:1991 ఆగస్టు 6న

చుండూరు మాలలపై హత్యాకాండ:1991 ఆగస్టు 6న

గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 1991 ఆగస్టు 6న ఎనిమిది మంది దళితులను ఊచకోతకోసిన కేసులో ప్రత్యేక కోర్టు శిక్షలు విధించిన నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచి మంగళవారంనాడు సంచలనా త్మకమైన తీర్పు వెలువరించింది. ఇది బాధిత కుటుంబాలకేగాక దళిత ఉద్యమకారులకు, ప్రజాతంత్రవాదు లందరికీ దిగ్భ్రాంతికరం. మరి హంతకులెవరు? ఇంత ఘోరమైన హత్యాకాండ శిక్షరహితంగా చరిత్రలో మిగిలిపోవలసిందేనా? దళితేతర వ్యవసాయ కుటుంబాల వారు మూకుమ్మడిగా దాడి చేసి దళితులను దారుణంగా హత్యచేసిన ఘటన ఆనాడు సంచలనం రేపింది. రెండు దశాబ్దాల అనంతరం కూడా బాధిత కుటుంబాలకు న్యాయం జరగడంలేదంటే అది సందేహానికతీతంగా సాక్ష్యాధారాలు సేకరించటంలో పోలీసుల వైఫ ల్యం, కేసును పకడ్బందీగా వాదించటంలో ప్రాసిక్యూషన్‌ వైఫల్యం. ఇంత దారుణమైన హత్య కేసులో నిందితులకు శిక్ష పడకపోతే దళితులకు న్యాయం జరిగేదేప్పుడు? 71 మంది సాక్షులను విచా రించిన ప్రత్యేక కోర్టు 21మందికి జీవిత ఖైడు, 35మందికి సంవత్స రం పాటు జైలుశిక్ష విధించింది, 123 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2007 జులై 31న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్‌ ఇచ్చిన తీర్పును నిందితులు హైకోర్టులో సవాలు చేశారు.
1991 ఆగస్టు6న దళితుల ఘోరహత్యల తదుపరి దళిత ఉద్యమ నేతలు ఆందోళన చేబట్టారు. సెప్టెంబర్‌లో ఆందోళన ఉధృతం కాగా పోలీసు కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అక్టోబర్‌లో పోలీసులు 219 మందిపై హత్య, ఎస్‌.సి., ఎస్‌.టి. అత్యాచారాల నిరోధక చట్టం కింద ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కాలంలో 33మంది చనిపోయారు. సత్వర విచారణకై ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు 1993లో రాష్ట్ర ప్రభుత్వం హామీ యిచ్చింది. 1995 మార్చిలో జిల్లా కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రత్యేక కోర్టును చుండూరులోనే ఏర్పాటు చేయాలని దళితులు కోరు తుండగా, సమన్‌లు తీసుకోవటానికి నిందితులు నిరాకరించారు. 2000 ఆగస్టులో మానవహక్కుల ఉద్యమనేత బి.చంద్రశేఖర్‌ను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. 2003 ఆగస్టు 1న చంద్రశేఖర్‌ విచారణ కొరకు దరఖాస్తు చేయగా, ప్రత్యేక కోర్టును వ్యతిరేకిస్తూ నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లగా వారి పిటిషన్‌లను అవి తిరస్కరించాయి. 2004 సెప్టెంబర్‌లో చుండూరులో ప్రత్యేక కోర్టు విచారణ ఆరంభమైంది. 2007 జులై 31న న్యాయమూర్తి తీర్పు వెలువరించగా; శిక్షకు గురైన ముద్దాయిలు ఆగస్టులో హైకోర్టులో అప్పీలు చేయగా, 2011లో అక్కడ విచారణ మొదలైంది. 2013 జనవరిలో చంద్రశేఖర్‌ మరణించగా, అక్టోబర్‌లో బొజ్జా తారకం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులైనారు. కేసును విచారిస్తున్న హైకోర్టు బెంచ్‌ని మార్చాలన్న పిటిషన్‌ 2014 మార్చిలో తిరస్కరించబడింది.
ఈ కేసు చరిత్ర చూస్తే, విచారణను జాగుచేయటానికి నింది తులు న్యాయచట్టంరీత్యా తమకున్న అవకాశాలన్నిటినీ వినియో గించుకున్నట్లు విదితమవుతుంది. జస్టిస్‌లు ఎల్‌.నరసింహారెడ్డి, ఎం.ఎస్‌. జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం నిందితులందర్నీ నిర్దో షులుగా విడుదల చేస్తూ వెలువరించిన తీర్పులో పేర్కొన్న అంశాలను బట్టి దర్యాప్తులో పోలీసుల ప్రాసిక్యూషన్‌ వైఫల్యం స్పష్టమవుతోంది. న్యాయమూర్తులు పేర్కొన్నట్లుగా దాడులు, హత్యల గూర్చి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. దళితులు అంతగా భయభ్రాంతులైనారు. దళిత ఉద్యమం ఆందోళన చేబట్టాకగాని కేసు నమోదుకాలేదు. హత్యలు కచ్చితంగా ఏ సమయంలో, ఎక్కడ జరగాయో, నేరానికి పాల్పడిన వారెవరో నిర్దిష్టంగా పేర్కొనటంలో ప్రాసిక్యూషన్‌ విఫల మైందని, పలువురు సాక్షుల వాంగ్మూలం లోపభూయిష్టంగా వుందని వాటి ఆధారంగా క్రిమినల్‌ కేసులో శిక్షలు విధించటం సాధ్యంకాదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ కేసుకున్న సున్నితత్వాన్నిబట్టి చుండూరు, మోదుకూరుల్లో కనీసం మూడు నెలలపాటు వేడుకలు లేదా నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు రూరల్‌ ఎస్‌.పి.ని ధర్మాసనం కోరింది.దళిత సముదాయానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన సహాయం వారి ఆవేదనను తొలగించలేదని వ్యాఖ్యానిస్తూ, మానవ విలువలు, పరస్పర గౌరవం అలవరించేందుకు వ్యక్తులు, సంఘాలు శాయశక్తులా కృషిచేయాలని ధర్మాసనం కోరింది.

 

 

 

 

(Visited 984 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply