మా గురించి

బ్రాహ్మణ వాద విష సంస్కృతి నేడు సామాజిక జీవితానికి సంభందించిన అన్ని రంగాలలో విజృంభిస్తుంది. ఈ అధిపత్య, అణిచివేత సంకృతిని ఓడించి మానవీయ సంకృతి నిర్మాణం కోసం ఎస్.సి., ఎస్.ఎస్టి., బి.సి. మరియు మైనారిటీ కి చెందిన ఉత్సాహవంతులైన యువత దళిత విప్లవ సంస్కృతిని , సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సిన చారిత్రక కర్తవ్యం ఉంది. సాంస్కృతిక రంగం లో ఈ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సాహితీ, సాంస్కృతికోద్యమం బ్రాహ్మణ వాద సంస్కృతిలోనే కొనసాగి చారిత్రక వైఫల్యానికి గురైంది. ఈ చారిత్రక నేపధ్యంలోంచి సామాజిక అణిచివేతను తుదముట్టించడానికి ఒక నూతన సామాజిక పొరాట శక్తిగా దళిత ఉద్యమం ముందుకు వచ్చింది. ఈ ఉద్యమ ప్రేరణతోనే దళిత సాహిత్య సాంస్కృతికోద్యమం ఉనికిలోనికి వచ్చి డప్పు కొట్టి, కలం పట్టి గళం విప్పింది. విభిన్న మార్గాలలో వివిధ సంస్థలు, శక్తులు, వ్యక్తులు చేస్తున్న ఈ కృషిని రాష్ట్ర వ్యాప్తం గా ఒకచోట ఫోకస్ చేయడానికి ఈ వెబ్ సైట్ నిర్వహించడం జరుగుతుంది,

*సమస్త వర్ణ, వర్గ, లింగ, కుల, జాతి, భాషా ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకం గా పొరాడి అణిచివేతకు దోపిడికి అసమానతలకు తావులేని నిజమైన ప్రజాస్వామిక విలువలతో కూడిన సమాజ నిర్మాణాఅనికి కృషిచేస్తుంది.
*కుల అసమానతలతో సమాజంలో అణిచివేతకి, బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటాలకు బాసట గా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది.
*బ్రాహ్మణాధిక్య సంస్కృతికి వ్యతిరేకం గా పొరాడిన మన పూర్వికులు చార్వాకులు, లోకాయుతులనుండి బుద్దుడు , బసవేస్వరుడు, పోతులూరి, అమీర్ కుస్రో , గురునానక్, గురువుంద దాసు, జ్యోతి రావ్ ఫూలే, పెరియార్, నారాయణగురూ, అంబేడ్కర్, జాషువా,కుసుమ ధర్మన్న తదితరులు చారిత్రక స్ఫూర్తిని స్వీకరిస్తుంది . వారి సమాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్కృతిక సైద్దాంతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
* భౌతిక వాద శాస్త్రీయ దృక్పథం తో సాహితీ సాంస్కృతి రంగంలో కృషి చేస్తుంది .
* ఇండియన్ నేటివ్ నెట్వర్క్ నకు అంబేడ్కరిజం తాత్విక పునాది .
* స్త్రీ అణచివేత కి మూలమైన మగ పెత్తనానికి , పితృస్వామ్య కుటుంబాధిపత్య వ్యవస్థ కి వ్యతిరేకంగా పోరాడుతుంది.
* కుల,వర్గ,లింగ,మత,జాతి తదితర అన్ని రంగాల ప్రజల్ని సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా అణచివుంచి ఆధిపత్యం చెలాయించే సంస్కృతిని తుదముట్టించటానికి పోరాడే విప్లవ సంస్కృతే దళిత సంస్కృతి. ప్రజాస్వామ్య నూతన సంస్కృతి విలువల నిర్మాణమే దళిత సంస్కృతి.
* ఎస్సీ, ఎస్టీ, బీసి లకు చెందిన అణగారిన కులాల్లో మైనారిటీలలో దాగివున్న ప్రజల శక్తి యుక్తుల్ని వెలికితీసి, సాహితీ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక,రాజకీయ, తాత్విక రంగాలన్నింటిలోనూ నూతన పోరాటానికి నాయకత్వం వహించేట్లుగా వారి సృజనాత్మక శక్తుల్ని అభివృద్ధి చేస్తుంది.

Send articles and write ups:
Our Mail ID: inneditorialboard@gmail.com
Whatspp No :