​॥ బి జే పి పాలనలో పెచ్చరిల్లిన దళితుల పై దాడులు ॥/రాజ్యసభలో మాయావతి ఆందోళన/

​॥ బి జే పి పాలనలో పెచ్చరిల్లిన దళితుల పై దాడులు ॥/రాజ్యసభలో మాయావతి ఆందోళన/

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దళితులపై దాడులు తీవ్రమ య్యాయని బీఎస్పీ అధినేత్రి, ఎంపీ మయావతి విమర్శించారు. గుజరాత్‌లోని యునా పట్టణంలో దళిత యువకులపై జరిగిన పాశవిక దాడి ఘటనను ఆమె రాజ్యసభలో సోమవారం లేవనెత్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి, మయావతికి స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తరువాత చైర్మన్‌ అనుమతితో ఈ అంశంపై మాయవతి మాటా ్లడారు. ‘గుజరాత్‌లోని యునా పట్టణంలో కొన్ని అసాంఘికశక్తులు దళిత యువకుల చేతులు కట్టేసి, బట్టలు ఊడదీసి చితకబాదారు. పోలీసులు సైతం తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడి చూస్తున్న జనం కూడా జోక్యం చేసుకోలేదు’ అని వివరించారు. పైగా దాడికి పాల్పడిన దుండగులపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని విమర్శించారు. ఈ ఘటనను మీడియా ప్రచారం చేసిన తరువాతే పోలీసులు చర్యలకు ఉపక్రమించారని తెలిపారు. ఈ దాడి దళితులపై బీజేపీకి ఉన్న ‘దళిత వ్యతిరేక వైఖరి’ని ప్రస్ఫుటం చేస్తోందని విమర్శించారు. అయితే బీజేపీ పేరు ప్రస్తావించడంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభ్యంతరం తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ దేశానికి రక్షకుడని, పైగా సభలో ఏదైనా అంశంపై చర్చించేటప్పుడు పార్టీ పేరును ప్రస్తావించొద్దని సూచించారు. అయితే మాయావతి మాట్లాడుతున్న సందర్భంలో ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు చైర్మన్‌ హమిద్‌ అన్సారీ ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు వెల్‌లో నిరసన తెలిపారు6


.

(Visited 135 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply