దాల్..దళిత్..దాద్రి’ ఈ మూడు అంశాలు దేశంలో ప్రధానంగా వివాదాస్పదమైన అంశాలు

దాల్..దళిత్..దాద్రి’ ఈ మూడు అంశాలు దేశంలో ప్రధానంగా వివాదాస్పదమైన అంశాలు

దాల్..దళిత్..దాద్రి’ ఈ మూడు అంశాలు దేశంలో ప్రధానంగా వివాదాస్పదమైన అంశాలు. ఈ అంశాలే మన దేశంలో ఉన్న సామాన్య, దళిత, మైనారిటీల బతుకు చిత్రం ఎలా ఉందో చెబుతున్నాయి. ఎన్డీయే పాలనలో దేశం ఎంత సుబిక్షంగా, సురక్షితంగా ఉందో చూపెడుతున్నాయి.

దాల్: ప్రతి సామాన్యుడికి నిత్యావసర సరుకు. అది లేనిదే ముద్ద దిగదు. ఏ వంటకం చేయాలన్నా దాల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్వతహాగా మాంసాహారం తిననివారు, మాంసాహారం కొనడానికి తగిన ఆర్ధిక స్థోమత లేనివారు ఎక్కువగా తినేది పప్పే. ఇప్పుడు అదే పప్పు మాంసాహారాన్ని తలదన్నే ఖరీదుకు చేరింది. కిలో కందిపప్పు ధర అమాంతం 180, 190 రూపాయలకు చేరింది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ అంతగా పెరగని పప్పు ధర ఇప్పుడే ఎందుకు పెరిగిందంటే సమాధానం ఒక్కటే..ప్రభుత్వ వైఫల్యం.

దళిత్: ఇంకా మన దేశంలో వర్ణ వివక్షత పొలేదనటానికి నిదర్శనం దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు. అక్టోబర్ లో ఫరీదాబాద్ లోని ఓ దళిత కుటుంబాన్ని అగ్ర వర్ణాల వారు ఇంట్లో ఉండగానే తగుల బెట్టారు. ఈ దాడిలో కుటుంబంలోని ఇద్దరు చిన్న పిల్లలు, పిల్లల తల్లి సజీవ దహనమయ్యారు. ఇప్పటికీ ఈ దారుణంలో సరైన న్యాయం జరుగలేదు. దీన్నిబట్టి దేశంలో దళితులు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారో అర్థమవుతుంది. దీనికీ ప్రభుత్వ పరిపాలనా లోపమే కారణం.

దాద్రి: ఎప్పటి నుంచో ఆవు మాంసం తింటున్న మన దేశంలో కొన్ని మతతత్వ శక్తులు ఆవు దేవుడితో సమానం. ఆవు మాంసం తినకూడదు. ఎవ్వరు ఈ నియమాన్ని ఉల్లంఘించినా ఊరుకోం అంటూ హెచ్చరికలు చేశాయి. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో యూపీలోని దాద్రిలో ఓ ముస్లిం వృద్దుడు ఇంట్లో గోమాంసం కలిగి ఉన్నాడన్నా నెపంతో అతన్ని కిరాతకంగా హిందువులంతా కలిసి రాళ్లతో కొట్టి చంపారు. ఇది పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటన కూడా దేశంలో మైనారిటీలకు రక్షణ ఏమాత్రం ఉందో బట్టబయలు చేస్తోంది.

దేశ పరిస్థతి అతి దారుణంగా ఉంది అని తెలుపుతున్న ఈ మూడు అంశాలే మోదీ ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూలుస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే ఎన్డీయే తన హిందూత్వ ధోరణులతో ఢిల్లీ, బీహార్ లలో ఓటమిని చవిచూసింది.

దాల్..దళిత్..దాద్రి

(Visited 143 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply