దళిత బహుజనులే రాజ్యమేలాలి – ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వక్తలు

దళిత బహుజనులే రాజ్యమేలాలి – ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వక్తలు

దళిత బహుజనులకు అధికారం దక్కినప్పుడే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని.. ఆ కళ సాకారం కోసం నేటి విద్యార్థి సంఘాలు ఐక్యంగా ముందుకు పోవాలని ఓయూ దళిత బహుజన పూర్వ విద్యార్థుల అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో వక్తలు సూచించారు. ఉస్మానియా వర్సిటీ వందేళ్ల సంబరాలను పురస్కరించుకొని ఆదివారం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ప్రజా గాయకుడు గద్దర్‌, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌, మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌, కంచె ఐలయ్య, రాజారాం యాదవ్‌, దరువు అంజయ్య, బెల్లయ్య నాయక్‌ సహా పలు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్‌ కాలేజీ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలకు సన్మానం చేసి బహుమతులు అందించారు. ఆనాడు ఒక్క నిజాం మాత్రమే ఉండేవాడని, ప్రస్తుతం ఎంతో మంది నిజాంలను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని గద్దర్‌ అన్నారు. మధుయాష్కీ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల చేతుల్లోనే రాజకీయం, వ్యాపారం ఉండటం వల్లే మెజారిటీ ప్రజలు అడుక్కునే స్థాయిలో ఉన్నారన్నారు. సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం దళిత బహుజనులు పోరాటం చేయగా.. అగ్రవర్ణాల వారు ఏసీల్లో తిరుగుతున్నారన్నారు.

(Visited 82 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply