గర్భిణి పై దేశభక్తుల దాడి

గర్భిణి పై దేశభక్తుల దాడి

చనిపోయిన జంతు కళేబరాన్ని ఊరి నుంచి తొలగించలేదన్న కోపంతో గుజరాత్‌లోని ఓ దళిత కుటుంబంపై దుండగలు దాడి చేశారు. ఈ దాడిలో నిండు గర్భిణీతోపాటు ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ బనాస్ కాంత జిల్లాలోని కజ్రా గ్రామంలో ఈ ఘనట చోటు చేసుకుంది. 

దర్భార్ సామాజిక వర్గానికి చెందిన పదిమంది యువకులు తమ కుటుంబంపై దాడి చేసినట్లు ధనభాయ్ రస్ వాసియా పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ‘మా ఇంటిపైకి పదిమంది దూసుకొచ్చి ఊళ్లో చచ్చిన జంతువును తొలగిస్తారా లేదా అంటూ మా మాటవినకుడానే దాడి చేశారు. నా భార్య గర్భిణీ అని తెలిసి కూడా కడుపై తన్నారు. ఇతర చోట్లా తీవ్రంగా కొట్టారు. చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని బెదిరించారని,’ రన్ వాసియా చెప్పారు. ప్రస్తుతం ఆయన భార్య సంగీతాబేన్ తో పాటు దాడిలో గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రన్ వాసియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల ఉనాలో దళితులపై దాడి జరిగిన నేపథ్యంలో..చచ్చిన జంతువులను తొలగించరాదని దళితులు ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. 

(Visited 933 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply