కామాంధుడిపై తిరగబడ్డ దళిత బాలిక

కామాంధుడిపై తిరగబడ్డ దళిత బాలిక

మగపశువుల లైంగిక దాడికి బలైపోతున్న చిన్నారులు, యువతులు, మహిళల దీనగాథలు రోజూ చూస్తూనే వున్నాం. రోజువారీ లైంగికదాడి వార్తలకు భిన్నమైనది ఈ దళిత బాలిక యదార్థగాథ. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా, వీరోచితంగా ఎదుర్కొని తనను తాను కాపాడుకోవడమేకాదు… ఆ కామాంధుడి భరతం పట్టింది. కత్తితో తన కసితీరా అతని మర్మాంగాలపై దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా ఇంకోలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం పొలం పని మీద ఊరి బయటకు మైనరు (17) వెళ్ళింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన రయీస్‌(23) ఆమె దగ్గరకు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో ఆమెను బెదిరించి… లైంగికదాడికి యత్నించాడు. ఈ హఠాత్‌ పరిణామానికి ఆమె వణకలేదు.. తొణకలేదు… ధైర్యంగా… సాహసోపేతంగా పోరాడింది. యువకుడి చేతిలో ఉన్న కత్తిని చాకచక్యంగా లాక్కుని అతని మర్మాంగాలపై దాడి చేసింది. అతడి అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరకున్నారు. తీవ్రగాయాల పాలైన రయీస్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

SOURCE: http://www.prajasakti.com/WEBCONTENT/1809384

(Visited 90 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply