అతడిని శిలువ వేశారేమో..!

అతడిని శిలువ వేశారేమో..!

ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన ఇండియన్ ప్రీస్ట్ ను గుడ్ ఫ్రైడే నాడు.. శిలువ వేసి ఉంటారనే ఆనుమానాలు బలపడుతున్నాయి. యెమెన్ లో మార్చి 4న ఒక రిటైర్డ్ మెంట్ హౌస్ పై ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో ఫాదర్ టామ్ ఉజునలిల్ ను ఎత్తుకెళ్లారని భావిస్తున్నారు.

అతి కిరాతకంగా.. దాడిచేసిన తీవ్రవాదులు.. ఓ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ పై దాడి చేసి..  నలుగురు క్రైస్తవ సన్యాసినులతో సహా.. 16 మందిని చంపేశారు. దాడి తర్వాత అదే హొం లో బస చేస్తున్న ఫాదర్ టామ్ జాడతెలియడం లేదు. గత ఆదివారం  ఓ క్రైస్తవ సన్యాసిని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫాదర్ టామ్ పై జరగనున్న హింసకు సంబంధించి ఒక మెసేజీ పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రకారం గుడ్ ఫ్రైడే నాడు ఫాదర్ ను శిలువ వేసే అవకాశం ఉనట్లు అనుమానిస్తున్నారు.

మరో వైపు దాడికి ముందు ముగ్గురు ఇథియోపియన్ క్రిస్టియన్ యువకులు హోమ్ లోకి హడావుడిగా వచ్చి.. ఐఎస్ఐఎస్ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చారని. తర్వాత కొద్ది సేపటికే.. మారణ హోమం జరిగిందని. అప్పుడే ఫాదర్ ని కిడ్నాప్ చేశారని ఓ సన్యాసిని చేతిరాతతో ఉన్న నోట్ హోమ్ లో లభించిందని పేర్కొంటూ  అలెటియన్ అనే క్రిస్టియన్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది.

భారత్ లోని బెంగళూరు నగరంలోని డాన్ బాస్కోకి చెందిన సలేషియన్ సిస్టర్స్ సభ్యులు మాట్లాడుతూ.. ఫాదర్ ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. హోమ్ పై దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే యెమెన్ అధికారులు మాత్రం ఇది ఐఎస్ఐఎస్ దుశ్చర్యే అని ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అల్ ఖైదా కు కూడా పట్టు ఉండంతో.. వారు చేసి ఉంటారని కొంత మంది విస్తున్నారు.

(Visited 83 times, 1 visits today)

You might also like

0 Comments

No Comments Yet!

You can be first to comment this post!

Leave a Reply